3.మధుస్ఫీతా వాచః పరమమమృతం
అవతారిక
తన స్తోత్రముయొక్క ప్రయోజన మును దెలుపుచున్నాఁడు.
శ్లోకము
మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవతః
తవ బ్రహ్మన్ ! కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ ।
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్థేఽస్మిన్ పురమథన ! బుద్ధిర్వ్యవసితా ॥ ౩॥
హేబ్రహ్మన్ మధుస్ఫీతా పరం అమృతం నిర్మితవతో వాచ స్తవ సురగరోః బ్రహ్మణః వచ్కోపి కిం విస్మయపదమితి యో జనాః =పర మేశ్వరా, నీవాక్కు అత్యంతమధురమైనదియు, శబ్దగత గుణాలం కారాదిగుణములు కలదియు, అత్యంతము వధురమైన దియు, అర్థగతమాధుర్యాది గుణములుకలదియు. నీకు సకల దేవత లకు గురువైన బ్రహ్మవాక్కు అనఁగా స్తుతియు ఆశ్చర్యకరము కానేరదు. నీవు సర్వజ్ఞుఁడవు. అప్రయత్నముగా నిశ్వాసమువలె లె అనాయాసముగా నిర్మించిన వేదములు గలదియు, శబ్దగమాధు ర్యము అర్థగతమాధుర్యము గలదియునగు వాక్కుగలవాఁడవు. అట్టి నీకు సకల దేవతాగురువైన బ్రహ్మయొక్క వాక్కును (స్తోత్ర మును) ఆశ్చర్యమును కలుగఁజేయనేరదు. అట్టినీకు నేను చేసిన స్తోత్రము ఎంతమాత్రము విస్మయకరము కానేరదు. మరి ఎందుకు స్తుతించెదవనిన,
మమ ఏతాం వాణీం భవతః గుణకథనపు ణ్యేన పునావితి=నిన్ను స్తుతించెడి ఈనా వాక్కు (జిహ్వ)ను నీగుణ వర్ణనవలనఁ గలిగిన పుణ్యముచేత పవిత్రమైనదానినిగాఁ జేయుద మని జిహ్వాసాఫల్యముకొఱకు నిన్ను స్తోత్రము చేయుటకు నా బుద్ధి ప్రయత్నించుచున్నది.
ఓ దేవా! యమృతవాక్కులుగల నీకు బృహస్పతియంతవాని స్తవమైన నద్భుతకరంబుగ నుండునా? ఉండదు,
కావున వాస్తవముగ నిన్ను సంతోష పెట్టలే కున్నను నీ మహిమను గుఱించి నుడువుటవలనఁ గలుగు పుణ్యముచే నా వాక్కును బరిశుద్ధము చేసికొనుటయే నా సంకల్పము.
ఓ ఈశ్వరా! అమృతస్వరూపమైనవియు, కావుననే తేనెవలె మధురమయినవియు నగు వేద వాక్కులను రచించు బృహస్పతి వాక్కు సైతము నీ కాశ్చర్యము గలిగింపదన, నాబోటి వాని స్తుతివాక్య మెట్లాశ్చర్యము నొందించును? ఆశ్చర్యము నొందింపదు. అట్లయిన మౌనమును వహించుట మంచిదిగదా యన, నీగుణకథనముచే గలిగెడు పుణ్యమువలన నా వాక్కును పవిత్రము జేసికొనవలయునని స్తోత్రరచన సంకల్పించితినని దానికి సమాధానము.
బ్రహ్మతత్వరూపా! నేను నీ స్థూలరూపమును- అందలి నీ మహిమములను- వర్ణించి స్తుతించదలచుచున్నానేకాని అందులకును నేను అంతగా సమర్థుడను కాను, నీవు పరమామృతము అనదగినదియు తేనెతో నిండినదా! అనునంతగా మధురమును అగు వేదవైదిక వాఙ్మయము నంతను నిర్మించిన మహాకవివి నీవు; బ్రహ్మాదులును అట్టి నీచిత్తమునకు చమత్కారము కలిగించి తృప్తిపరచగల కవులు కారు. అట్లు కాగా అల్ప సామర్థ్యము మాత్రము కల నేను నిన్ను నా కవితతో స్తుతించి మెప్పించగలనా! అయినను ఈ నా వాక్కుతో నిన్ను స్తుతించి ఆవిధముగా దానిని పవిత్రమునుగా చేసికొనవలయునను సంకల్పముతో మాత్రమే నా బుద్ధి ఈ నీ స్తుతిరచన చేయనిశ్చయించినది.
సాహిత్య విషయములు
వృత్తము - శిఖరిణీ
మధుసూదన సరస్వతి వ్యాఖ్య
తియ్యని మాటలన్ సుధ నతిప్రరసురంబుగఁ గూర్చునట్టి మా
యయ్య ! బృహ స్పతిస్తుతియు నద్భుత మెట్లగు నీకు? నాదు ధీ
యియ్య కొనుక్ భవత్కథల నేర్పడఁ బల్కెడు పుణ్యరాశి చే।
న్యాయ్యముగా మదీయరసన న్విమలం బొసరింప శంకరా!॥
సరసపు వాక్కులం దమృతసారము చిప్పిలఁ జేయునో ప్రభూ
సురగురువాకు దేవతయుఁ జోద్యము నీ కొనఁ గూర్పఁజాలు నే
పురమథనా! మదీయ గుణపూరిత వాణిని సద్గుణో క్తి పు
ణ్యరసములన్ బునీతము పొనర్తు నటంచుఁ బూనితే మతిన్.