2.అతీతః పన్థానం తవ
అవతారిక
ఈశ్వరునియొక్క సగుణస్వరూపమే తన స్తోత్రమునకు విషయమని చెప్పుచున్నాఁడు
శ్లోకము
అతీతః పన్థానం తవ చ మహిమా వాఙ్మనసయోర్
అతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి ।
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ॥ ౨॥
అన్వయము
తాత్పర్యము
ఓఈశ్వరా! నీ మహిమ యవాఙ్మానసగోచర మగుటం జేసి వేదములే నీ మహిమ నదికాపదికాదని భయపడుచుఁ బల్కుచున్నవి. అట్టి మహిమయొక్క గుణము లేవో, యెదెట్లు స్తోత్రార్హమో, యెవ్వనికి విషయమో, యూహింప శక్యము గాకున్నది. కావున నీయొక్క సగుణస్వూపమే స్తోత్రమునకును ధ్యానమునకును స్థానమైయున్నది.
సాహిత్య విషయములు
వృత్తము - శిఖరిణీ
మధుసూదన సరస్వతి వ్యాఖ్య
తా. హే హర!,
తవ మహిమావాఙ్మనసయోః పంథానం ఆతీతశ్చ=ఓ శంకర, నిన్ను స్తుతించుటకు నీయొక్క సగుణ నిర్గుణస్వరూపమైన మహిమ వాఙ్మనస్సులకు విషయత్వమును గోచకత్వమును అతిక్రమించిన దైయున్నది. సగుణపక్షమందు నీ మహిమ అనంతమైనందునను, నిర్గుణపక్షమందు ధర్మరహితమై నందునను ఆపారమైనందున, నీవు మనో వాక్కులకు గోచరము కానివాఁడవు. తథా చ శ్రుతిః “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ” ఇతి.
యం శ్రుతిః అపౌరుషేయమపి చకితం భీతం అభిధత్తే తాత్పర్యేణ వదతి ప్రతిపాదయతి = పర మేశ్వరునిగురించి అపౌరుషేయమైన శ్రుతి అనఁగా దేవ వాణి యగు వేదము సైతము భయకుడుచు తాత్పర్యరూప ముగా సూచనచేయుచున్నది గాని స్పష్టముగా చెప్ప లేదు. భయ కారణ మేమనిన సగుణపక్షమం దిట్టవాఁడవని నిర్దేశించు టకు అనంతరూపములు కలిగినందున శక్యము కానందునను, నిర్లుణపక్షమందు స్వయం ప్ర కాశ మాన మైనవస్తువును ప్రకా శింపఁజేయఁగల వస్త్వంతరాభావముచేతను చెప్పశక్యముగాక భయపడుచున్నదని భావము.
శ్రుతి మరి ఏలాగున ఏమి చెప్పిన దనిన:—అతద్వ్యావృత్యా వదతి అతద్వ్యావృత్తిచేత చెప్పినది. అనఁగా సగుణపక్షమందు జగత్తును తర్భిన్న ముగా భావింపఁగూడ దనియు, నేతినేతి శ్రుతిచేత సర్వము ని వేధింపఁబడగా మిగిలినది పక మేశ్వరుఁడనియు, నిర్గుణపక్ష, మండు భాగత్యాగలక్షణఅనఁగా జహదజహల్లక్షణచేత పరమాత్మ ఇట్టివాఁడని తెలుసు. కొన తగినవాఁడని సూచించుచున్న దిగాని ముఖస్థముగా ఇట్టివాఁ డని చెప్పుటకు శ్రుతియు భయపడుచున్నదని భావము. సగుణపక్షమందు అభేదభావనకు ప్రమాణము. — శ్రు “సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వకర్మా సర్వకామః” ఈ మొదలగు ప్రమాణముల చేత సర్వాభేదముగా చెప్పుచున్నదిగాని ప్రత్యేకించి విభాగముగా మహిమను చెప్పలేదని భావము
అతద్వ్యావృత్తి: భాగత్యాగలక్షణయనఁగా: మాయో పాధిక చైతన్యపరము తత్పదము. అవిద్యోపాధిక చై తన్యపరము త్వంపదము. అనఁగా తత్పదము సర్వవ్యాపకుఁడైన పరమేశ్వర పుము. త్వంపదము బుథ్యాద్యుపహితమైన చైతన్యరూపజీవ పరము. తత్పద-త్వం: దముల చేత గ్రహింపఁబడెడి జీవేశ్వరులను గాని, మాయావిద్యలనెడు రెండు ఉపాధులనుగాని విడిచి వాటి యందున్న చైతన్యమును మాత్రము గ్రహించినపుడు అదే పర మే శ్వరస్వరూపము ఏకమై మిగులును. ఆదియే అందరికిని స్వస్వ రూపము. ఇది భాగ్యగలక్షణ. ఇట్లు గ్రహింపన లెనని శ్రుతి - —— వేదమాత బోధించుచున్నది. ఇదే జహదజహల్ల క్షణ. కనుక అట్టి స్వప్ర కాశచైతన్యమును దెలిసికొని తదా కారవృత్తితో నుండ వలెనని వేదమాత బోధించుచున్న దిగాని, అతనిని వాక్కు చేత ఇట్టివాఁడని బోధించ శక్యముకాదని భావము.
సగుణో నిర్గుణళ కస్య స్తోతవ్యః? న కేనా పీత్యర్థః=సగుణ- నిర్గుణస్వరూపములుగల యతం డెవనికి స్తుతించ శక్యమైనవాఁడు? అతనిని స్తుతించుటకు ఎవడికి శక్యము కాదని భావము సగుణస్య స్తోతవ్యాభావే హేశృరూహ=సగుణమును స్తుతించెడివాఁడు లేక పోవుటకు హేతును చెప్పుచున్నారు. కతివిధగు ణేలి= అతఁడు ఎట్టు గుణములు కలవాఁడని. అనంతగుణములు స్వరూపములు కలిగి. నందున అతనిని స్తుతించుటకు ఎవరికిని శక్యము కాదని భావము.
ఇక నిర్గుణుని కూడ స్తుతించెడివాఁడు లేఁడని అందుకు హేతు వును చెప్పుచున్నారు.
కస్య విషయః=అతను ఎవడికి ఇట్టివాఁడని గోచరుఁడగును? ఏధక్ష్మములు లేనివాఁడుగనుక ఎవడికిన్ని ఇట్టివాఁడని గ్రహించు టకు కూడ శక్యముకాదని భావము. ఇట్లు చెప్పినయెడల పూర్వ కమందు “స్వమతిపరిణామావధి గృణ" అని చెప్పిరి కదా పూర్వాపర విరోధము కలుగదా అనినయెడల, అట్టివిరోధము లేదని చెప్పుచున్నారు.
అర్వాచీనే పదే కస్య విదుషో మనో న పతతి కస్య వచో న పతతి= భక్తానుగ్రహార్థము గ్రహింపఁబడిన వృషభ వాహనము, పినా కాయుధము, భస్మాంగరాగము, వ్యాఘ్రచర్మాంబరము, సర్పరూపసర్వాలంకారములు, చతుర్భుజములు, పంచముఖ ములు, త్రి గేత్రములు, పార్వతీయు గలవాఁడగు పరమేశ్వరుని నవీనస్వరూప ముందు ఎనఁడిమనస్సు ప్ర వేశించదు? ఎవఁడివాక్కు ప్రవేశించదు? అట్టి నూతనస్వరూపమును అందరు చూడఁగల కనియు, అందరు స్తోత్రము చేయఁగలరని భావము. ఇందువలన పూర్వాపరవిరోధము లేదని భావము.
నవీనమనఁగా వెనుక చెప్పిన ప్ర కారము సగుణపక్షమందు జగదా కారము గాను, నిర్గుణపక్షమందు భాగత్యాగలక్షణగాను ఎవఁడు ధ్యానించునో, వానియం దనుగ్రహించి వెనుక చెప్పిన స్వరూపముగా పర మేశ్వరుఁడు భక్తుని కెదురుగా సాక్షాత్కార మగుచుండును గనుక ఎప్పటి కప్పుడే నవీనరూపము కలవాఁడని భావము. గనుక అట్టి సగుణ నిర్గుణస్వరూపమందు అందరి మనోబుద్ధులును ప్రవేశించఁగలవని భావము. ఇంతవరకు వ్యాఖ్యానము వలనఁ దెలిసిన తాత్పర్యము.
పద్యానువాదము
ఉ॥ వాక్కునకు న్మనంబున కవశ్యము నీ మహిమంబు
దాని నీ। ఫక్కిది యంచు వేద ములె వల్కఁగ నోడు
గుణాన్వితంబెటౌ?! నెక్కరణి న్నుతిఁప నగు నెవ్వనికా విషయంబు?
కావునన్ వాక్కు మనంబు లెవ్వనివి వర్తిల వీశ ! భవద్గుణాకృతిన్?